నారా లోకేష్ అరెస్ట్..
Nara Lokesh: గుంటూరులో నారా లోకేశ్‌ను అరెస్ట్ చేశారు. రమ్య ఇంటి వద్ద ఉద్రిక్త పరస్థితులు ఏర్పడ్డాయి.;
Lokesh Arrest: గుంటూరులో నారా లోకేశ్‌ను అరెస్ట్ చేశారు. లోకేశ్‌ను నల్లపాలు పోలీస్ స్టేషన్ వైపు తీసుకెళ్తున్నారు పోలీసులు. రమ్య ఇంటి వద్ద ఉద్రిక్త పరస్థితులు ఏర్పడ్డాయి. నక్కా ఆనందబాబుపై గుంటూరు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీసులు కింద పడేశారు. ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రను సైతం అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.