అశేష జనవాహిని మధ్య నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ఇసుకేస్తే రాలనంత జనం..లక్షలాదిమందిని నేరుగా కలుస్తూ,అనుక్షణం ప్రజల్లో మమేకమై కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తానని భరోసా ఇస్తూ యువనేత చేస్తున్న పాదయాత్రలో ఏన్నో ఆసక్తికర సంఘటనలు.ఏ జిల్లా అయినా.. ఏ ప్రాంతమైనా సరే చిన్నారులు కనిసిప్తే చాలు యువనేత లోకేష్‌లో కొత్త జోష్ కనిపిస్తుంది. అప్పటివరకు పడ్డ అలసట ఎగిరిపోతుంది. చిన్నారులతో సరదాగా గడుపుతున్నారు లోకేష్. ఏ ఊరు వెళ్లినా పిల్లలతో కలిసి సందడి చేస్తున్నారు.. పసిబిడ్డలని ఎత్తుకుని ముద్దాడుతున్నారు.తన పాదయాత్రలో ఎక్కడ చిన్నారులు కనిపించినా, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, వారికి చాక్లెట్లు, పుస్తకాలు, పెన్నులు ఇస్తున్నారు. వారితో ఆటలాడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తూ ముద్దుల మామయ్యగా మారిపోయారు.
ఇక చిన్నారులు కనిపిస్తే హైఫై కొడుతూ.. వారితో కబుర్లు చెబుతున్నారు. ఏ ఊరు వెళ్లినా, ఏ కార్యక్రమానికి హాజరైనా లోకేష్ వెంట ఉండే సిబ్బంది దగ్గర చాక్లెట్ల బ్యాగు ఒకటి ఉంటోంది. అందుకే పిల్లలు లోకేష్‌కు కొత్త పేరు పెట్టారు. చిన్నారులు నారా లోకేష్‌ని చాక్లెట్ల మామయ్యగా పిలుస్తున్నారు.లోకేశ్ చిన్నపిల్లలతో మమేకం అవుతూ, వారిని నవ్విస్తూ, కానుకలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. అందుకే అంతటి జన సందోహంలో కూడా చిన్నారులు లోకేష్ చేతుల్లో సేద తీరుతూ.. కేరింతలు కొడుతున్నారు. కొన్నిచోట్ల అయితే లోకేష్ చేతుల్లో నుంచి వారి పేరంట్స్ దగ్గరికి కూడా వెళ్లడానికి చిన్నారు నిరాకరిస్తున్నారంటేనే ఆర్ధమవుతుంది.. పిల్లలను యువనేత ఎంతలా లాలిస్తున్నాడో అని.
ఇక చేతులకు గాయాలైనా భుజాల నొప్పి బాధిస్తున్నా, చిన్నారులు కనిపిస్తే చాలు లోకేష్ వారితో మమేకమవుతూ వారిని ఆడిస్తున్నారు. చిన్నారులకు గిఫ్ట్ ఇస్తూ ఉత్సాహపరుస్తున్నారు. చాక్లెట్లు, పుస్తకాలు కానుకగా ఇస్తున్నారు. లక్షలాదిమంది మధ్య యువగళం పాదయాత్ర సాగుతున్నా మహిళలు మాత్రం తమ చిన్నారులను పాదయాత్రకు తీసుకొస్తున్నారు. లోకేష్ చేతికి తమ బిడ్డలను అందించి సంబరపడుతున్నారు. పిల్లలు కూడా లోకేష్ దగ్గర అంతే సౌకర్యంగా ఉంటూ కేరింతలు కొడుతున్న దృశ్యాలు ఆసక్తిగా మారాయి.
రాయలసీమ అయినా పల్నాడు అయినా అదే చెరగని చిరునవ్వు..తరగని ఆప్యాయత..అంతకు మించి మీకు నేనున్నా నంటూ భరోసా.. సమస్యల యువగళం సారథి నారా లోకేష్ పాదయాత్ర ఆద్యంతం ప్రజల్ని ఆకట్టుకుంటుంది. ఎండైనా..వానా అయినా లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్న యువనేతపై చిన్నారులు చూపించే అప్వాయతతో తడిసి ముద్దైపోతున్నారు.అపూర్వం, అమేయం అన్నట్లుగా లోకేష్‌తో చిన్నారులు మమేకం అవుతున్నారు.. మా భవిష్యత్తు మీరే మామయ్య అంటూ లోకేష్ చేతుల్లో ఒదిగిపోతుంటే.. మరికొన్న చోట్ల అయితే తమ ముద్దల మామయ్య కోసం ఎదురుచూసి మరీ ఆయనతో కలసి ఆడుకోవాలని తపిస్తున్న చిన్నారులు ఎందరో ఉన్నారని ఈ దృశ్యాలు చూస్తుంటే అర్ధమవుతుంది.