41 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయం : లోకేష్
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.;
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇళ్ల స్థలాలకు భూ సేకరణలో ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకది సెంటు స్థలం, వైఎస్ జగన్‌కికి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం అన్నారు లోకేష్. స్థల సేకరణలో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని మండిపడ్డారు.
పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ 6,500 కోట్లని ఆరోపించారు. టీడీపీ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ చేరిగిపోదు అన్నారు. జగన్ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు, గుట్టలు, శ్మశానాల్లో, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదన్నారు లోకేష్. ఇప్పుడున్న ఆధారాలతో జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డితో పాటు చిప్పకూడు తినడం ఖాయమంటూ ట్వీట్ చేశారు లోకేష్ ..ఇప్పటి వరకూ టీడీపీ కేసుల వలనే స్థలం ఇవ్వలేకపోతున్నాం అన్నారు మరి ఇప్పుడెలా ఇస్తున్నారంటూ లోకేష్ నిలదీశారు.