TS Corona Cases: తెలంగాణలో 591 కొత్త కేసులు..
TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.;
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 591 మందికి పాజిటివ్‌గా తేలింది. 1,07,472 నమూనాలను పరీక్షించించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,997కి పెరిగింది. కరోనా మహమ్మారితో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,807కి పెరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,819 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. రికవరీ రేటు 98.04 శాతం కాగా.. మరణాల రేటు 0.58గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.