NTR: మహిళా సాధికారకతకు ఎన్టీఆర్ కృషి

ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్

Update: 2025-09-15 04:00 GMT

తి­రు­ప­తి­లో ని­ర్వ­హిం­చిన జా­తీయ మహి­ళా సా­ధి­కా­రిత సద­స్సు­లో ఎన్టీ­ఆ­ర్ పేరు ప్ర­స్తా­వ­న­కు వచ్చిం­ది. స్వ­యం­గా రా­జ్య­సభ డి­ప్యూ­టీ చై­ర్మ­న్ హరి­వం­శ్ నా­రా­యణ సిం­గ్ గు­ర్తు చే­శా­రు. మహి­ళా సా­ధి­కా­రి­త­కు నం­ద­మూ­రి తా­ర­క­రా­వు ఎంతో కృషి చే­సి­న­ట్లు తె­లి­పా­రు. ఎన్టీ­ఆ­ర్‌­కు ప్ర­ణా­మా­లు అంటూ సభను హరి­వం­శ్ నా­రా­యణ సిం­గ్ ఉత్తే­జ­ప­రి­చా­రు. అభి­వృ­ద్ది చెం­దిన దే­శా­ల్లో మహి­ళ­ల­కు ప్ర­ధా­న్యత ఇచ్చా­ర­ని చె­ప్పా­రు. మహిళ సా­ధి­కా­రత కోసం ప్ర­ధా­ని మోడీ చాలా కా­ర్య­క్ర­మా­లు ని­ర్వ­హిం­చా­ర­న్నా­రు. బీ­హా­ర్‌ ఎన్ని­క­ల్లో తొ­లి­సా­రి­గా మహి­ళ­ల­కు 50 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పిం­చా­మ­ని చె­ప్పా­రు. జన్ థన్ యో­జ­న­లో మహి­ళ­ల­కు సగా­ని­కి పైగా ఖా­తా­లు­న్నా­య­న్నా­రు. టె­క్నా­ల­జీ హబ్‌­గా ఉమ్మ­డి ఏపీ­ని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు తీ­ర్చి­ది­ద్దా­ర­ని గు­ర్తు చే­శా­రు. ఏపీ­లో­నే తొ­లి­సా­రి­గా నై­పు­ణ్య గణ­న­ను చే­ప­ట్టా­ర­న్నా­రు. శ్రీ­సి­టీ­లో మహి­ళా ఉద్యో­గు­లు సగా­ని­కి­పై­గా ఉన్నా­ర­ని హరి­వం­శ్ సిం­గ్ పే­ర్కొ­న్నా­రు.

తొలి జా­తీయ మహి­ళా సా­ధి­కా­రత సద­స్సు ప్రారంభం


తి­రు­ప­తి­లో తొలి జా­తీయ మహి­ళా సా­ధి­కా­రత సద­స్సు ప్రా­రం­భ­మైం­ది. లో­క్‌­సభ స్పీ­క­ర్‌ ఓం బి­ర్లా ఆధ్వ­ర్యం­లో ‘వి­క­సి­త్‌ భా­ర­త్‌­కు మహి­ళల నా­య­క­త్వం’ అనే ని­నా­దం­తో ఈ సద­స్సు­ను ని­ర్వ­హి­స్తు­న్నా­రు. ము­ఖ్యఅ తి­థి­గా ఏపీ గవ­ర్న­ర్‌ జస్టి­స్‌ అబ్దు­ల్‌ నజీ­ర్‌ పా­ల్గొ­న్నా­రు. ఈ సద­స్సు­కు శా­స­న­సభ స్పీ­క­ర్‌ అయ్య­న్న­పా­త్రు­డు, డి­ప్యూ­టీ స్పీ­క­ర్‌ రఘు­రా­మ­కృ­ష్ణ­రా­జు, మం­త్రి పయ్యా­వుల కే­శ­వ్‌, పా­ర్ల­మెం­ట్‌ కమి­టీ (మహి­ళా సా­ధి­కా­రత) ఛై­ర్‌­ప­ర్స­న్‌ దగ్గు­బా­టి పు­రం­దే­శ్వ­రి­తో పాటు పలు­వు­రు మం­త్రు­లు, ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు కూ­ట­మి నే­త­లు, వి­విధ రా­ష్ట్రాల ప్ర­తి­ని­ధు­లు హా­జ­ర­య్యా­రు. మహి­ళ­ల­కు గౌ­ర­వం ఇవ్వ­డం ఆది నుం­చి వస్తు­న్న భారత సం­ప్ర­దా­య­మ­ని లో­క్‌­సభ స్పీ­క­ర్‌ ఓం బి­ర్లా అన్నా­రు. దే­శం­లో ఆధ్యా­త్మిక, సా­మా­జిక ఉద్య­మా­ల్లో స్త్రీ­లు కీలక పా­త్ర పో­షిం­చా­ర­ని చె­ప్పా­రు. తి­రు­ప­తి­లో ని­ర్వ­హిం­చిన జా­తీయ మహి­ళా సా­ధి­కా­రత సద­స్సు­లో ఆయన మా­ట్లా­డా­రు. ‘‘స్వా­తం­త్ర్య పో­రా­టం­లో­నూ మహి­ళ­లు కీ­ల­క­పా­త్ర పో­షిం­చా­రు. వారి భా­గ­స్వా­మ్యం లే­కుం­డా ఏ దే­శ­మూ అభి­వృ­ద్ధి చెం­ద­లే­దు. సా­మా­జిక బం­ధ­నా­ల­ను ఛే­దిం­చు­కు­ని మహి­ళ­లు అనేక ఉద్య­మా­ల్లో పా­ల్గొ­న్నా­రు. వా­రి­కో­సం రా­జ్యాం­గం అనేక ని­బం­ధ­న­లు రూ­పొం­దిం­చిం­ది. మహి­ళా శక్తి కా­ర­ణం­గా­నే ఇవాళ ప్ర­పం­చం­లో­నే భా­ర­త్‌ ము­ఖ్య­దే­శం­గా అవ­త­రిం­చిం­ది. 



Tags:    

Similar News