AP : అధికారులు అలర్ట్‌గా ఉండాలి.. గోదావరి వరదలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
కోనసీమ జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద పరిస్థితిపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఆయన వరద ప్రభావిత ప్రాంతాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగావరద ముంపునకు గురయ్యే గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు చేపట్టాలని చెప్పారు.
సహాయక చర్యలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గోదావరి వరదల పరిస్థితిపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని.. క్షేత్రస్థాయిలో ఉన్నత అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షతో కోనసీమ జిల్లా అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన హెచ్చరికలు జారీ చేస్తూ, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.