DEAD: హుస్సేన్ సాగర్‌ విషాదం.. యువకుడి మృతి..!

Update: 2025-01-28 05:52 GMT

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌ లో ఆదివారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మృతిచెందారు. పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో జరిగిన 'భారత మాతకు మహా హారతి' కార్యక్రమంలో పడవలో బాణసంచా పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గణపతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. మరోవైపు రెండు రోజులవుతున్నా ఈ ఘటన తరువాత అదృశ్యమైన అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గల్లంతైన యువకుడి కోసం ఆచూకీ

హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదంలో నాగారానికి చెందిన అజయ్ అదృశ్యమైనట్లు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్‌లో గాలించి అజయ్ ఆచూకీ తెలపాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో అజయ్ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు లేక్ PSలో ఫిర్యాదు చేశారు. ట్యాంక్ బండ్లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో చింతల కృష్ణ, సాయి చంద్, సునీల్, ప్రవీణ్ సహా 8 మందికి కాలిన గాయాలు కాగా, వారిని యశోద, గాంధీ, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపుగా అంతా హాస్పిటల్స్ నుంచి డిశ్ఛార్జ్ కాగా, గణపతి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చికిత్స పొందుతూ గణపతి మంగళవారం ఉదయం మృతిచెందడంతో విషాదం నెలకొంది.

Tags:    

Similar News