PAWAN: "గోదావరి" కలను నెరవేర్చే దిశగా కీలక అడుగు

నేడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు పవన్ శంకుస్థాపన... వాటర్ గ్రిడ్ గోదావరి జిల్లాల చిరకాల వాంఛ... రూ. 3,050 కోట్లతో ప్రాజెక్టు పనులు ఆరంభం..

Update: 2025-12-20 05:00 GMT

ఉమ్మ­డి గో­దా­వ­రి జి­ల్లాల ప్ర­జల చి­ర­కాల వాం­ఛ­ను నె­ర­వే­ర్చే ది­శ­గా కూ­ట­మి ప్ర­భు­త్వం వే­స్తో­న్న కీలక అడు­గు­కు శుభ ము­హూ­ర్తం ఖరా­రైం­ది. 3 వేల 50 కో­ట్ల రూ­పా­య­ల­తో చే­ప­ట్టే వా­ట­ర్ గ్రి­డ్ ప్రా­జె­క్ట్ ని­ర్మాణ పను­ల­కు ఈ నెల 20న ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కల్యా­ణ్‌ స్వ­యం­గా శం­కు­స్థా­పన చే­య­ను­న్నా­రు. పె­ర­వ­లి­లో­ని ఎన్‌­హె­చ్ 216ఏ దగ్గర ఆర్‌­కే రైస్ మిస్ సమీ­పం­లో ని­ర్మా­ణం జరు­గు­తుం­ది. ఈ ప్రా­జె­క్టు ద్వా­రా అధు­నా­తన సాం­కే­తి­క­త­తో సర్ ఆర్థ­ర్ కా­ట­న్ బ్యా­రే­జీ వద్ద ధవ­ళే­శ్వ­రం, బొ­బ్బ­ర్లంక, వే­మ­గి­రి సమీ­పం­లో నుం­డి గో­దా­వ­రి జలా­లు శు­ద్ధి చేసి తూ­ర్పు, పశ్చిమ గో­దా­వ­రి, కా­కి­నాడ, ఏలూ­రు, డా. బీ­ఆ­ర్ అం­బే­ద్క­ర్ కో­న­సీమ తది­తర 5 జి­ల్లా­ల్లో­ని 23 ని­యో­జ­క­వ­ర్గా­లు, 66 మం­డ­లా­ల్లో­ని రూ.67 లక్షల 82 వేల. మంది ప్ర­జ­ల­కు లబ్ధి చే­కూ­ర­నుం­ది. ఇం­దు­లో భా­గం­గా 1,650 కో­ట్ల రూ­పా­యా­ల­తో ఉమ్మ­డి తూ­ర్పు­గో­దా­వ­రి­లో­ని కా­కి­నాడ, డా.బి.ఆర్ అం­బే­ద్క­ర్ కో­న­సీమ, ఈస్ట్ గో­దా­వ­రి­లో­ని 11 ని­యో­జ­క­వ­ర్గా­లు, 32 మం­డ­ల­లా­ల్లో­ని 39 లక్షల 64 మంది ప్ర­జ­ల­కు, రూ.1,400 కో­ట్ల­తో ఉమ్మ­డి పశ్చి­మ­గో­దా­వ­రి జి­ల్లా­లో­ని ఏలూ­రు, పశ్చి­మ­గో­దా­వ­రి, ఈస్ట్ గో­దా­వ­రి కొ­వ్వూ­రు, ని­డ­ద­వో­లు తది­తర ప్రాం­తా­లు 12 ని­యో­జ­క­వ­ర్గా­లు, 34 మం­డ­లా­ల్లో­ని 28 లక్షల 18 వేల మంది ప్ర­జ­ల­కు త్రా­గు­నీ­రు సమ­స్య­కు శా­శ్వత పరి­ష్కా­రం లభిం­చ­నుం­ది.

జల్ జీన్ మి­ష­న్ ని­ధు­ల­తో రెం­డు దశ­ల్లో ని­ర్మాణ పనుల పూ­ర్తి­కి కా­ర్యా­చ­రణ ప్ర­ణా­ళిక సి­ద్ధ­మైం­ది. ఈ నే­ప­థ్యం­లో 2 ఏళ్ల­లో వా­ట­ర్ గ్రి­డ్ ప్రా­జె­క్టు పనుల పూ­ర్తి­కి కూ­ట­మి ప్ర­భు­త్వం చర్య­లు చే­ప­ట్ట­నుం­ది. గో­దా­వ­రి డె­ల్టా ప్రాం­తం­లో భూ­గ­ర్భ జలా­లు ఉప్పు నీ­రు­గా మా­ర­డం, కలు­షి­తం కా­వ­డం వల్ల ప్ర­జ­లు ఎదు­ర్కొం­టు­న్న అనా­రో­గ్య సమ­స్య­ల­కు చెక్ పె­ట్టేం­దు­కు కూ­ట­మి ప్ర­భు­త్వం ఎన్ని­క­ల్లో ఇచ్చిన మాట ప్ర­కా­రం ఈ ప్రా­జె­క్ట్ ను సకా­లం­లో పూ­ర్తి చేసి శా­శ్వత పరి­ష్కా­రం చూ­ప­నుం­ద­ని రా­ష్ట్ర పర్యా­టక, సాం­స్కృ­తిక, సి­ని­మా­టో­గ్ర­ఫీ మం­త్రి, ని­డ­ద­వో­లు శా­స­న­స­భ్యు­లు కం­దుల దు­ర్గే­ష్ స్ప­ష్టం చే­శా­రు. అలా­గే ధవ­ళే­శ్వ­రం వద్ద అత్యా­ధు­నిక సాం­కే­తి­క­త­తో కూ­డిన వా­ట­ర్ ట్రీ­ట్‌­మెం­ట్ ప్లాం­ట్ల­ను ని­ర్మిం­చి గ్రా­వి­టీ ద్వా­రా అం­త­ర్జా­తీయ ప్ర­మా­ణా­ల­కు అను­గు­ణం­గా నీ­టి­ని శు­ద్ధి చేసి పైప్ లై­న్ల ద్వా­రా ఇం­టిం­టి­కి తా­గు­నీ­రు అం­దిం­చ­ను­న్నా­మ­న్నా­రు. ఇన్నే­ళ్లు­గా అఖండ గో­దా­వ­రి ప్ర­వ­హి­స్తు­న్న­ప్ప­టి­కీ గో­దా­వ­రి వా­సు­ల­కు త్రా­గు­నీ­రు సమ­స్య వెం­టా­డే­ద­ని, కేం­ద్ర సహ­కా­రం, సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు, డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్‌ల నే­తృ­త్వం­లో­ని కూ­ట­మి ప్ర­భు­త్వ చొ­ర­వ­తో ప్ర­జ­ల­కు సు­ర­క్షిత త్రా­గు­నీ­రు అం­ద­నుం­ద­ని పే­ర్కొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా ని­డ­ద­వో­లు పర్య­ట­న­కు తొ­లి­సా­రి­గా వి­చ్చే­స్తు­న్న ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కల్యా­ణ్‌­కు ఘన­స్వా­గ­తం పల­క­ను­న్నా­రు.

Tags:    

Similar News