Pithapuram: పవన్ రాకతో మారుతున్న పిఠాపురం రూపురేఖలు
మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలవడంతో ఆ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతున్నాయి. పిఠాపురంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ అమోదం తెలిపడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్... PUDAగా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తానని ప్రకటన చేసిన 48 గంటల్లోనే పిఠాపురంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలిపింది. పిఠాపురంలో 30పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలపడం పట్ల స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా పిఠాపురం రూపు రేఖలు మారబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ ఆసక్తికరంగా సాగింది. దాని షార్ట్ నేమ్.. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ షార్ట్ నేమ్ ‘పాడా’ అనే వస్తుందని, దాంతో కన్‌ఫ్యూజ్ అవుతారని కొంతమంది ప్రశ్న లేవనెత్తారు. అప్పుడు పిఠాపురం స్పెల్లింగ్ ప్రకారం ‘పీడా’ అని పేరు పెడదామా? అన్న ప్రతిపాదన.. ఆ పేరు బాలేదని పవన్ చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ పిఠాపురం అని పేరు పెడదామని అధికారులు ప్రతిపాదించారు. పిఠాపురం తీర మెట్ట మైదానం కలిసిన ఏకైక నియోజకవర్గం. మూడు మండలాలు 52 గ్రామ పంచాయతీల గల పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలు ఉన్నాయి. ఈనియోజకవర్గంలో సుమారు 4లక్షలు జనాభా ఉన్నారు. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో ఈ నియోజకవర్గం నూతన అధికారులు సంతరించుకొనుంది.
తనదైన ముద్ర
తనను శాసనసభ్యుడిగా గెలిపించి అసెంబ్లీకి పంపడమేగాక డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టడంతోపాటు రాష్ట్రంలో, దేశంలో బలంగా నిలిపిన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ఎన్నికల తర్వాత పిఠాపురం సభలో ప్రకటించిన పవన్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. రెండు రోజుల క్రితమే గొల్లప్రోలు సభలో తాను ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి చేసిన కృషి, జరుగుతున్న, జరగబో యే పనుల గురించి వివరించారు. పిఠాపురం మండలంలోని 24 గ్రామాలు, గొల్లప్రోలు మండలంలోని 10 గ్రామాలు, కొత్తపల్లి మండలంలోని 18 గ్రామాలు వెరసి 52 గ్రామాలను పాడా పరిధిలోకి తీసుకువచ్చారు. పిఠాపురం ప్రాంత సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచారశాఖా మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు. క్యాబినెట్ సమావేశంలో పవన్ ద్వారా వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం ల భించింది. పాడా ఏర్పాటువల్ల ఇప్పటి వరకూ కాకినాడ ఏరియా అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ(కుడా) పరిధిలో ఉన్న ఈ రెండు పట్టణాలు, 52 గ్రా మాలు పాడా పరిధిలోకి వస్తాయి. దీనివల్ల వీటిని పాడా ద్వారా అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్లాన్స్, లేఅవుట్లు ఆమోదం రుసుం, ఇతరత్రా మార్గాల్లో పాడాకు ఆదాయం వస్తుంది. పట్టణాభివృద్ధి సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు ఇస్తు న్నాయి. మరోవైపు పాడా వైస్‌చైర్మన్‌గా ఆర్డీవో స్థాయి అధికారిని నియమిస్తారు. చైర్మన్‌గా అనధికారలను నియమించే వరకూ జిల్లా కలెక్టర్ లేదా జేసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.