PAWAN: ఎర్ర చందనం చెట్లను పరిరక్షించుకోవాలి
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పిలుపు... ఎర్రచందనం గోడౌన్ పరిశీలించిన పవన్.. లాట వివరాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం
ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా మంగళంలో అటవీశాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్‌ను పవన్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ, బీ. సీ, నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కూటమి అధికారంలోకి రాగానే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్న పవన్ కల్యాణ్... నేపాల్‌లో కూడా మన ఎర్రచందనం పట్టుబడిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా మనకు అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నామన్న డిప్యూటీ సీఎం.. గత ఐదేళ్లలో విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్నారు. ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను నరికేశారని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.
నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర తెలుసుకున్నారు.
అడవిలో ప్రయాణం
అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణించారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ సంప్రదాయ రాజకీయ నాయకుడిలా కాకుండా.. భిన్నమైన డ్రెస్ లో రావడం అందర్నీ ఆకర్షించింది. డిప్యూటీ సీఎం అయితే మాత్రం స్టైలిష్ డ్రెస్‌లో రాకూడదనేం లేదు కాబట్టి కల్యాణ్ ఇటీవల స్మార్ట్ గా క్యాజువల్స్ లోనే సమీక్షలు నిర్వహించారు. అటవీ ప్రాంత పర్యటనకు ఆర్మీ తరహా డ్రెస్ తో వచ్చారు. ఆయన అలా రావడంతో పోలీసులు కూడా తమలో ఒకరిగా చూసుకున్నారు.
8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలపై ఆరా తీశారు. ప్రతి గోడౌన్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణించిన ఆయన… రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టును పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలను పరిశీలించిన పవన్ కల్యాణ్…. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.