PEDDAPURAM: మలుపులు తిరుగుతోన్న పెద్దాపురం వ్యభిచారం కేసు
పెద్దాపురంలో జంకు బొంకు లేకుండా.. వ్యభిచారం;
పెద్దాపురం వ్యభిచారం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తనతో భారతి అనే మహిళ బలవంతంగా వ్యభిచారం చేయించిందని, బెదిరించి బ్లాక్మెయిల్ చేసిందని ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనకు డబ్బులు కూడా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. మహిళ ఆరోపణలపై భారతి తాజాగా స్పందించింది. తనపై ఆరోపణలు చేసిన మహిళ తన పదేళ్ల కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించేదని, సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టిందని తెలిపింది. సదరు మహిళ ఓ లెస్బియన్ అని భారతి సంచలన విషయం తెలిపింది. ఆమె టార్చర్ భరించలేక తన పదేళ్ల కూతురు చేయి కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పేర్కొంది. తాను వ్యభిచార గృహం నిర్వహించేది వాస్తవమేనని, కానీ క్యారెక్టర్ తెలిసిన తర్వాత ఆమెను ఇంట్లోంచి పంపించేశానని చెప్పింది. తాను ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సింది లేదని భారతి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు.
పెద్దాపురంలో వ్యభిచార గృహాలపై కాకినాడ జిల్లా పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారు. భారతి అనే మహిళ వ్యభిచార గృహాలను నడుపుతోందని ఆరోపిస్తూ బాధితుల్లో ఒకరు తన ఆవేదనను వ్యక్తం చేసింది. తనను బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దింపారని ఆ మహిళ తెలిపింది. గర్భందాల్చి ప్రసవించిన తర్వాత కూడా తనను బంధించి అదేపని చేయించిందని పేర్కొంది. తాను పారిపోయే ప్రయత్నం చేస్తే నన్ను, నా బిడ్డను చంపుతానని బెదిరించిందని చెప్పింది.. తనకు భారతి నుంచి ప్రాణహాని ఉందని, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని, కుటుంబ సభ్యులు కూడా ఇంటికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ఆరోపణలను భారతి కొట్టేసింది. పెద్దాపురంలో జంకు బొంకు లేకుండా.. వ్యభిచారం సాగుతోంది. ఎప్పుడో రూపు మారిపోయిందనుకున్న పడుపు వృత్తి మళ్లీ బుసలు కొడుతోంది. పెద్దాపురం వీధులు ఇప్పుడు రెడ్‌లైట్ ఏరియాలను తలపిస్తున్నాయి. ఒకప్పుడు పెద్దాపురం ఎలా ఉండేదో… మళ్లీ ఆ పెద్దాపురంలా మార్చేస్తున్నారు కొందరు పడుపు వ్యాపారులు.