AP Land Titling act: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల భూములు పోతాయా?

భూ దందాలు చేసే వారికి అనుకూలమా

Update: 2024-05-03 00:00 GMT

జగన్‌ను మరోసారి నమ్మితే ఆస్తులపై రాష్ట్ర ప్రజలు ఆశలు వదులుకోవాల్సిందేనని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొత్త భూహక్కు చట్టంతో ప్రజల ఆస్తుల రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే పెడతామని హామీ ఇచ్చారు 

 అమరావతిపై కక్షగట్టి జగన్ నాశనం చేశారని లేకపోతే...గుంటూరు, విజయవాడ ప్రపంచస్థాయి నగరాలుగా అభివృద్ధిని చెంది ఉండేవని చంద్రబాబు అన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరులో జరిగిన సభలో పాల్గొన్నారు. మూడురాజధానులు పేరిట వైకాపా మూడుముక్కలాట ఆడిందన్నారు. అమరావతిపై వారి అభిప్రాయం ఏంటో చెప్పి ఓట్లు అడగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో ఐటీ టవర్స్‌ కట్టి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

 ప్రజల ఆస్తులన్నీ కొట్టేసేలా జగన్ దుష్టపన్నాగం పన్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటి వరకు బెదిరించే ఆస్తులు లాక్కున్నారని...కొత్త భూ హక్కు చట్టం ప్రకారం వారే వివరాలన్నీ తారుమారు చేసి తమ పేరిట రాసేసుకుంటారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2019 భూ పత్రాలు, దస్త్రాల ట్యాంపరింగ్ జరగకుండా ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు చెప్తున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో లోపాల కారణంగా చాలామంది యజమానులు పూర్తి స్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారు. ఫలితంగా భూ వివాదాలు ఏర్పడితే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఈ చట్టం వల్ల ఆ సమస్యలు తొలగిపోతాయని అధికారులు చెప్తున్నారు. భూ రికార్డులు సరిగా లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందేందుకూ ఇబ్బంది పడుతున్నారని దీని వల్ల ఊరట పొందొచ్చని ప్రభుత్వ ప్రజల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది. 

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం (యాక్ట్‌ 27/2023) విషయంలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం విషయంలో పలు కీలక తీర్మానాలు చేసింది. ప్రజా ప్రయోజనానికి, ముఖ్యంగా పేదలు, ఆర్థికంగా బలహీనవర్గాల వారికి విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయాలని తీర్మానం చేసింది. అంతేకాక ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫున హైకోర్టులో వ్యాజ్యం వేయాలని తీర్మానించింది. 

Tags:    

Similar News