పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇద్దరు కాలేజీ విద్యార్థులను తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేశారు. ఐదుగురు కలిసి ఒక విద్యార్థిని అతి కిరాతంగా కొట్టారు. బీసీ హాస్టల్‌కి తీసుకు వెళ్లి కొట్టి , కరెంట్ పెట్టి మరీ చంపుతామని బెదిరించారు. బయటనుంచి వ్యక్తితో కలిసి ఐదుగురు విద్యార్థులు దాడి చేసినట్లు బాధిత విద్యార్థి చెబుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేశ్ నాపై దాడి చేస్తారు
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వేళ వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. తనపై దాడి జరగబోతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి జరిగితే అందుకు బాధ్యత మంత్రి లోకేష్, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవిదేనని చెప్పారు. అలాగే వారిద్దరినీ సుమోటోగా తీసుకుని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. లోకేష్, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి దేనని చెప్పారు. అలాగే వారిద్దరినీ సుమోటోగా తీసుకుని సీబీఐ(Cbi)తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తనపై జరగబోయే దాడికి సంబంధించి టీడీపీ నేతలే సమాచారం ఇచ్చారని తెలిపారు. పులివెందులలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారంటూ సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీపైనా దాడి జరిగింది. దీనికి కారణం బీటెక్ రవి అన్న ఆరోపణలు ఉన్నాయి.