Rahul Gandhi : 300 కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ..
Rahul Gandhi : రాహుల్.... భారత్ జోడో యాత్ర 15వ రోజు కేరళలో ఉత్సాహంగా కొనసాగింది;
Rahul Gandhi : రాహుల్.... భారత్ జోడో యాత్ర 15వ రోజు కేరళలో ఉత్సాహంగా కొనసాగింది. ఉదయం ఎర్నాకులంలోని దేశోం జుమా మజీద్ నుండి యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కారుకుట్టి కప్పేలా జంక్షన్‌లో మార్నింగ్ బ్రేక్ అనంతరం... ఎర్నాకుళం కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు రాహుల్.
సాయంత్రం తిరిగి చిరంగార నుంచి పాదయాత్ర ప్రారంభించి....చాలుకుడి టౌన్‌హాల్ వరకు కొనసాగించారు. ఈ రాత్రికి అలువాలోని త్రిసూర్ జిల్లా చాలుకుడి లోని క్రిసెంట్ కన్వన్షన్ సెంటర్‌లో రాహుల్ బస చేస్తున్నారు రాహుల్. ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 300 కిలోమీటర్ల మార్క్‌ను దాటింది. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో లేనని స్పష్టం చేశారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్. కాంగ్రెస్ అధ్యకుడు అంటే పదవి కాదని.. సైద్దాంతిక వ్యవస్థగా అభివర్ణించారు. ఒక విధంగా దేశానికి ప్రాతినిధ్యం వహించటమేనని వివరించారు. తన నిర్ణయాన్ని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. దీని ద్వారా తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు.