AP: కొత్త రేషన్ కార్డులకు నేటి నుంచే దరఖాస్తులు

ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం... మార్పులు, చేర్పులకు అవకాశం;

Update: 2024-12-02 02:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. దీన్ని నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డులు రాని వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారితో పాటు కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు నేటి ( సోమవారం) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుకగా అర్హులకు జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది.


 ఎలా దరఖాస్తు చేయాలంటే..?

అటు ఆన్‌లైన్ ఇటు ఆఫ్‌‌లైన్ విదానాల్లో రేషన్ కార్డు కూడా దరఖాస్తు సుకోవచ్చు. అర్హులైనవాళ్లు కొత్త రేషన్ కార్డు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు విభజన, మార్పులు, చేర్పులు కూడా జరగనున్నాయి. ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 28 వరకూ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు తరువాత స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. అంతా పూర్తయ్యాక సంక్రాంతి లోపే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త డిజైన్లు, రాజముద్రతో కూడిన రేషన్ కార్డులు అందించనున్నారు. డిసెంబర్ మూడోవారంలో జరగనున్న కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డులకై చర్చ జరగనుంది.

కలెక్టర్లకు ఆదేశాలు

దరఖాస్తుల స్వీకరణ పూర్తైన తర్వాత వారిలో అర్హులైన వారిని గుర్తించి సంక్రాంతి పండుగ లోపు గుర్తించి కొత్తరేషన్‌ కార్డులు జారీ చేస్తారు. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి కూడా కొత్తగా బియ్యం కార్డులు అందనున్నాయి. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. కార్యాచరణ రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. కొత్త డిజైన్లతో, రాజముద్రతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. 

Tags:    

Similar News