REMAND: పిన్నెల్లి సోదరులకు రిమాండ్
14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి మాచర్ల న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు. గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు ఏ6, ఏ7గా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు కోర్టులో లొంగిపోయారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కోర్టులో లొంగిపోయారు. గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని సివిల్ జడ్జి కోర్టుకు వారిద్దరూ వచ్చారు.
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కోర్టులో లొంగిపోయారు. గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వారిద్దరూ వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోస్తు ఏర్పాటు చేశారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. గ్రామంలో ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలచుకొని జంట హత్యలకు పరోక్షంగా సహకరించారని పోలీసులు పిన్నెల్లి సోదరులను ఏ6, ఏ7గా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కింది కోర్టు, హైకోర్టు రద్దు చేయగా.. సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రద్దయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులిద్దరూ కోర్టులో లొంగిపోయారు.
మాచర్లలో ఉద్రిక్తత
పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మాచర్లలో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని తెలిపారు. కాగా, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కారులో మాచర్లకు బయలుదేరారు.విడదల రజిని ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు.