SCAM: ఏపీ లిక్కర్ స్కామ్‌లో నటి తమన్నా.?
వివాదాలకు కేంద్ర బిందువుగా వెంకటేష్ నాయుడు.. వెంకటేష్‌తో తమకు సంబంధం లేదన్న వైసీపీ;
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేశ్ నాయుడు పేరు ప్రస్తుతం అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. నోట్ల కట్టలను ఆయన లెక్కిస్తున్న వీడియో వైరల్ అయింది. తాజాగా ప్రముఖ సినీ నటి తమన్నాతో ఆయన ఫొటోలు సంచలనంగా మారాయి. సినీ ప్రముఖులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. తమన్నాతో కలిసి ప్రత్యేక జెట్ లో వెంకటేశ్ నాయుడు ప్రయాణించారు. ఈ సందర్భంగా వీరు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమన్నాకు, వెంకటేశ్ నాయుడుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయంపై టాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతోంది.
కవితతో కూడా...
వెంకటేశ్ నాయుడు తమన్నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫొటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వైసీపీ కీలక నేతలతో వెంకయ్య నాయుడు దిగిన ఫొటోలు సైతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అంతేకాకుండా వెంకటేశ్ నాయుడు విమానాల్లో విలాసవంతంగా గడుపుతున్న వీడియోలు, ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేశ్ నాయుడు గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఒంగోలు డమ్మీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసినట్టు వెలుగులోకి వచ్చింది.
బంగారం కొనుగోలుకేనా..?
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ3గా వెంకటేష్ నాయుడు ఉన్నారు. ఈ సంగతి ఏపీ ప్రజలతో పాటు ఆ కేసును ఫాలో అవుతున్న వ్యక్తులకు తెలిసిందే. అతనితో కలిసి తమన్నా ప్రయాణించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో లిక్కర్ స్కాం సెగలు తెలుగు చలన చిత్ర పరిశ్రమను కూడా తాకాయి. తమన్నాకు గోల్డ్, జువెల్లరీ బిజినెస్ ఉంది. ఆ వ్యవహారాలు ఆమె తండ్రి చూస్తారు. లిక్కర్ స్కాంలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన బంగారాన్ని వెంకటేష్ నాయుడు అండ్ కో కొనుగోలు చేశారనే కథనాలు బయట ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయి వారిద్దరూ అలా స్పెషల్ ఫ్లైట్ జెట్‌లో వెళ్లారని అంతా మాట్లాడుకుంటున్నారు. టాంజానీయాలో గోల్డ్ మైనింగ్ ప్రారంభించాలని వెంకటేష్ నాయుడు అనుకున్నాడట. ఆ విషయంలో తమన్నాకి ఏమైనా లింక్ ఉందా? అని కూడా ఆరాలు తీస్తున్నారు. అక్కడ నిర్వహించిన పార్టీ కోసమే డ్రెస్ కోడ్ కూడా వాడారా? అని ఆ బయటకు వచ్చిన ఫోటోల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతుంటే తమన్నా మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఎప్పుడూ ఎక్కడా కూడా వీటిని ఖండించడం లేదు. దీంతో అనుమానాలు పెరుగుతున్నాయి.
సినిమా నిర్మాణం వైపు అడుగులు
కన్నడ రంగంలో వెంకటేష్ నాయుడు సినిమాల నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో ఉన్నాడు అనే విషయం కొత్తగా వెలుగు చూసింది. తమన్నాతో కలిసి ఏదైనా సినిమాలు తీయాలనుకొన్నారా? అయితే సినిమాలే తీయడానికి కలిస్తే.. ఎర్రబుగ్గ కారును ఎందుకు ఉపయోగించారు? ఆ కారు ఎవరిది? ప్రోటోకాల్ వాహనాన్ని ఎవరు పంపించారు? తమన్నాతో కలిసి బెంగళూరుకు వెళ్లారా? ఇంకా ఎక్కడికైనా వెళ్లారా? అనే అనుమానాల్ని మీడియాతో సోషల్ మీడియాలో పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే లిక్కర్ స్కామ్ కుంభకోణం నిందితులతో తమన్నాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. ఏ రకమైన రిలేషన్స్ ఉన్నాయి? ఈ విషయాలపై మిల్కి బ్యూటీ మౌనం ఎందుకు? అనే ప్రశ్నలను సూటిగా సూటిగా సంధించింది. ఈ కేసు వ్యవహారం ముదురుతుండటంతో తమన్నాను సిట్ అధికారులు విచారణకు పిలుస్తారా? అనే విషయం కూడా మీడియాలో చర్చకు వచ్చింది. ఒకవేళ తమన్నాను విచారణకు పిలిస్తే ఈ కేసులో భారీ ట్విస్టులు బయటకు వచ్చే అవకాశమే కాకుండా ఈ కుంభకోణం మిల్కి బ్యూటీ మెడకు చుట్టుకొనే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.