విద్యార్థి రెండు చెంపలు ఎడాపెడా వాయించిన హెడ్‌మాస్టర్..
ఏకంగా గొంతు పట్టుకుని రెండు చెంపలు ఎడాపెడా వాయించాడు.;
అమ్మఒడి పథకం డబ్బులు రాలేదని అడిగిన పాపానికి తొమ్మిదో తరగతి విద్యార్థిపై.. రోడ్డుపైనే దాడికి దిగాడు ఓ హెడ్‌మాస్టర్. ఏకంగా గొంతు పట్టుకుని రెండు చెంపలు ఎడాపెడా వాయించాడు. విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతునిలో.. గత ఏడాది ఎనిమిదో తరగతి చదివిన రుప్వేశ్ నిరుపేద విద్యార్థి. తమకు అమ్మఒడి పథకం అమలయ్యేలా చూడమని.. విద్యార్థి తల్లిదండ్రులు పలుమార్లు హెడ్‌మాస్టర్ శర్మను కోరారు.అయితే సాంకేతిక కారణాలతో అవి రాలేదంటూ సిబ్బంది చేతులు దులుపుకున్నారు.
అసలు ఏం జరిగిందో కనుక్కునేందుకు విద్యార్థి హెడ్ మాస్టర్‌ను కలిసాడు. అదే అతను చేసిన పాపమైంది. నన్నే నిలదీస్తావా అంటూ విచక్షణ మరచి రుప్వేశ్‌ను కొట్టాడు.. హెచ్.ఎం శర్మ. ప్రధానోపాధ్యాయుడి వైఖరిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.