గవర్నర్‌తో ముగిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ భేటీ!
గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ భేటీ ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో తాజా పరిణామాల్ని వివరించారు.;
గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ భేటీ ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో తాజా పరిణామాల్ని వివరించారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు, పరిణామాలపై చర్చించారు. ఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణ వైఖరిని నిమ్మగడ్డ వివరించారు. ఎస్‌ఈసీ జేడీ 30 రోజుల సెలవు వెళ్లడంతో పాటు, మిగిలిన ఉద్యోగులు కూడా సెలవు పెట్టాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారని చెప్పారు. ప్రభుత్వం, ఉద్యోగస్తుల సహాయ నిరాకరణకు పాల్పడుతున్నారని గవర్నర్‌కు వివరించారు.