SKILL CASE: చంద్రబాబు అరెస్ట్.. జగన్ కక్ష సాధింపే

Update: 2026-01-13 05:00 GMT

ప్ర­జా­స్వా­మ్యం­లో చట్టం రా­జ­కీ­యా­ల­కు ఆయు­ధం­గా మా­రి­తే, న్యా­య­వ్య­వ­స్థే చి­వ­రి ఆశగా ని­లు­స్తుం­ది. గత వై­సీ­పీ ప్ర­భు­త్వ హయాం­లో ప్ర­తి­ప­క్ష నే­త­గా ఉన్న­ప్పు­డు చం­ద్ర­బా­బు నా­యు­డు­పై నమో­దు చే­సిన స్కి­ల్ డె­వ­ల­ప్‌­మెం­ట్ కేసు క్లో­జ్ కా­వ­డం, ఆ అరె­స్టు వె­నుక న్యా­య­బ­ద్ధత కంటే రా­జ­కీయ ప్ర­తీ­కా­ర­మే ప్ర­ధా­నం­గా పని­చే­సిం­ద­న్న అను­మా­నా­ల­ను మరింత బల­ప­రు­స్తోం­ది. ఆధా­రా­ల్లే­ని ఆరో­ప­ణ­లు, ‘మి­స్టే­క్ ఆఫ్ ఫ్యా­క్ట్’గా తే­లిన కేసు, 53 రో­జుల రి­మాం­డ్... ఈ పరి­ణా­మా­ల­న్నీ చట్ట­పా­లన పే­రు­తో రా­జ­కీయ కక్ష సా­ధిం­పు­కు చో­టి­చ్చిన ప్ర­మా­ద­కర ధో­ర­ణి­పై తీ­వ్ర ఆలో­చన అవ­స­ర­మ­ని ఈ తీ­ర్పు స్ప­ష్టం­గా హె­చ్చ­రి­స్తోం­ది. చం­ద్ర­బా­బు­ను జై­లు­కు పం­పిం­చ­డ­మే లక్ష్యం­గా గత వై­సీ­పీ ప్ర­భు­త్వం పన్నిన కు­ట్ర­గా మా­రిన స్కి­ల్ డె­వ­ల­ప్‌­మెం­ట్ కేసు చి­వ­ర­కు కు­ప్ప­కూ­లిం­ది. ఆధా­రా­ల్లే­ని ఆరో­ప­ణ­లు, రా­జ­కీయ దు­రు­ద్దే­శం­తో సా­గిన దర్యా­ప్తు, అధి­కార దర్పా­ని­కి అద్దం పట్టిన అరె­స్ట్.. ఈ మొ­త్తం వ్య­వ­హా­రం ‘మి­స్టే­క్ ఆఫ్ ఫ్యా­క్ట్’గా తే­ల్చు­తూ ఏసీ­బీ ప్ర­త్యేక న్యా­య­స్థా­నం కే­సు­ను క్లో­జ్ చే­సిం­ది. చం­ద్ర­బా­బు అరె­స్ట్ వె­నుక అప్ప­టి సీఎం వై.ఎస్. జగన్ మో­హ­న్ రె­డ్డి కక్ష సా­ధిం­పే ఉం­ద­న్న ఆరో­ప­ణ­ల­కు న్యా­య­స్థా­నం పరో­క్షం­గా ఆమోద ము­ద్ర వే­సి­న­ట్టైం­ది. అభియోగాలు వాస్తవం కానందున ఎట్టకేలకు ఆయనతోపాటు 37 మందిపై విచారణను కోర్టు మూసివేయడంతో.. ఓ సంచలన కేసుకు ముగింపు పలికినట్లయింది.

కీలక తీర్పు

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్‌ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ (మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌) సీఐడీ ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

 తప్పుడు ప్రచారమే !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని గత ప్రభుత్వం ఆరోపించింది. అయితే, విచారణలో ఒక్క రూపాయి కూడా దారి మళ్లినట్లు సీఐడీ పక్కా ఆధారాలు చూపలేకపోయింది. సెప్టెంబర్ 9, 2023న చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు, కనీసం ఎఫ్.ఐ.ఆర్ లో ఆయన పేరు కూడా లేదు. ప్రాథమిక ఆధారాలు చూపలేదు. లాయర్ గా కోర్టులో వాదనలకు.. రాజకీయ వాదనలకు తేడా తెలియని పొన్నవోలు వాదించి జైలుకు పంపారు. కానీ దర్యాప్తులో కనీస ఆధారాలు చూపించలేకపోయారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని నిర్ధారించడంతో, ఆ 53 రోజుల జైలు శిక్షకు బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతోంది.

Tags:    

Similar News