Sonu Sood : నటుడు సోనూసూద్‌కు మరోసారి బృహన్ ముంబై కార్పొరేషన్ నోటీసులు..!
Sonu Sood : నటుడు సోనూసూద్‌కు మరోసారి బృహన్ ముంబై కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఆరు అంతస్థుల భవనంలో ఆయన ఓ హోటల్ నడుపుతున్నారు.;
Sonu Sood : నటుడు సోనూసూద్‌కు మరోసారి బృహన్ ముంబై కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఆరు అంతస్థుల భవనంలో ఆయన ఓ హోటల్ నడుపుతున్నారు. కానీ, అది రెసిడెన్షియల్ భవనంలో ఉండటమే సమస్యకు కారణమైంది. హోటల్ వంటి వ్యాపారాన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో నిర్వహించటం చట్టరిత్యా నేరం. అందుకే, సోనూకి గతంలోనూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు అందించింది. దీనిపై కోర్టులోనూ బాలీవుడ్ నటుడికి చుక్కెదురైంది. గృహ సముదాయంగా ఉండాల్సిన భవనంలో హోటల్ ఎలా నిర్వహిస్తారని న్యాయస్థానం తప్పుబట్టింది.
తన హోటల్ ప్రస్తుతం ఉన్న ఆరు అంతస్థుల భవనాన్ని తిరిగి రెసిడెన్షియల్ బిల్డింగ్‌గా మారుస్తానని మాట ఇఛ్చిన సోనూ సూద్ ఇంకా చెప్పినట్లు చేయలేదు. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లోనే ఆయన హోటల్ కొనసాగుతోంది. దాంతో తాజాగా బీఎంసీ నుంచీ మరో మారు నోటీసులు వచ్చాయి. కరోనా సమయంలో అనేక మందికి సాయం చేస్తూ మంచి వాడుగా పేరుబడ్డ సోనూ సూద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో గొడవని ఎలా పరిష్కరించుకుంటారన్నది ఆసక్తిగా మారింది.