శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీకాళహస్తిలోని చతుర్మాఢ వీధులు శివనామస్మరణతో మారుమోగాయి.;
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని శ్రీవాయులింగేశ్వరుడు రావణాసుర, మయూర వాహనాలను అధిరోహించి మాఢవీధుల్లో ఊరేగారు. రాజుల కాలం నాటి ఆభరణాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించి.. అలంకార మంటపం నుంచి బయటికి తీసుకువచ్చారు. మహిళలు, భక్తులు కర్పూర హారతులివ్వగా, శివమాల ధరించిన భక్తులు శంకాలు పూరించారు. శ్రీకాళహస్తిలోని చతుర్మాఢ వీధులు శివనామస్మరణతో మారుమోగాయి.