STAMPADE: ప్రచారమే ప్రాణం తీసిందా?
కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై పలు అనుమానాలు
శ్రీకాకుళంలోని తొక్కిసలాట ఘటన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆలయ నిర్మాణ ధర్మకర్త గతంలో తిరుమలకు వెళ్లినప్పుడు దర్శనం కాకపోవటంతో 12 ఎకరాల సొంత భూమిలో ఆలయాన్ని నిర్మించారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం దర్శనాలు మే నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఆలయం గురించి SMలో విస్తృత ప్రచారం జరిగింది. ప్రతిరోజు ఆలయానికి 1000 మంది భక్తులు వస్తుండగా నేడు దాదాపు 25వేల మంది వచ్చారు.
దేవాదాయశాఖ పరిధిలో లేదు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాటలో 12 మంది మృతి చెందిన దుర్ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి దేవాదాయశాఖ ఉన్నత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నాను. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అదేశాలు జారీ చేశారు. దీంతో హుటాహుటిన శ్రీకాకుళం బయలుదేరిన దేవాదాయశాఖ ఉన్నత అధికారులు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలో లేదు అన్నారు. అది పూర్తిగా ప్రైవేట్ ఆలయం.. నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. ప్రభుత్వానికి నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదు.. ముందే సమాచారం ఇస్తే సరైన జాగ్రత్తలు తీసుకునే వాళ్లమని చెప్పారు.
భక్తుల మరణం కలచివేసింది: మోదీ
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఇలా ప్రాణనష్టం జరగడం చాలా బాధకరమన్నారు. క్షతగాత్రులు ఉన్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
నా మనసును కలచివేసింది: మోదీ
కాశీబుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం విచారకరమని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనంతా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. ‘‘తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని విచారం వ్యక్తం చేశారు. పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాశిబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భక్తుల మరణం తమను తీవ్రంగా కలచివేసిందని పలువురు రాజకీయ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు మెట్లు ఎక్కుతుండగా రద్దీ కారణంగా రెయిలింగ్ ఊడిపడింది. రెయిలింగ్ ఊడిపోవడంతో ఒకరిపై ఒకరు పడి 9 మంది మృతి చెందారు.