STAMPADE: వేంకటేశా.. నీకిది తగునా..?
తెలుగు రాష్ట్రాల్లో మరో విషాదం.. దైవ సన్నిధిలో మృత్యు ఘోష
తెల్లవారితే కార్తీక శుద్ధ ఏకాదశి. పొద్దుపొద్దునే అమ్మ నిద్రలేచింది. బిడ్డను లేపుతూ.. ఈ రోజు కార్తీకంలోనే అత్యంత మహిమాన్వితమైన రోజు. శివకేశవులను దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పింది. ఇది విన్న పక్కింటి అక్క.. పక్కనే ఉన్న పెద్దమ్మను శ్రీవారి దర్శించుకుందామని పురమాయించింది. ఇలా తాత నుంచి తంబి వరకు, తల్లి నుంచి చెల్లి వరకు అంతా.. రెడీ అయ్యారు. శ్రీవారి సన్నిదికి చేరకున్నారు. మరికొద్ది సేపట్లో స్వామివారి దర్శనం చేసుకుంటామనే ఆనందం. అయితే, శ్రీనివాసుని సన్నిధే.. వారికి చివరి వేదిక అవుతుందని ఊహించలేకపోయారు. రెయిలింగ్ రూపంలో మృత్యువు వెంటాడింది. తొక్కిసలాట జరిగి 9 మృతి చెందారు. గోవింద నామం రావాల్సిన భక్తుల నోటి నుంచి.. హాహాకారాలు వినిపించాయి. శ్రీవేంకటేశా వాళ్లు చేసినా తప్పేంటి.. నీ సన్నిధికి వచ్చిన వారికి ఈ రకమైనా శిక్ష వేయడం నీకు తగునా..?
కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. ఘటనాస్థలిలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. సుమారు 25 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మి (50), పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ (48), వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ (60), మందసకు చెందిన రాజేశ్వరి (60), బృందావతి (62) నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ (56), సోంపేటకు చెందిన నిఖిల్ (13), పలాసకు చెందిన అమ్ముడమ్మగా గుర్తించారు. రూప అనే మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
తొక్కిసలాట మృతులు వీరే..
కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు.. రాపాక విజయ(టెక్కిలి), ఏదూరి చిన్మమ్మి(రామేశ్వరం), మురిపించి నీలమ్మ(దుక్కవానిపేట), దువ్వు రాజేశ్వరి(చెలుపటియా), యశోదమ్మ(శివరాంపురం), రూప(గుడిభద్ర), డోక్కర అమ్ము(పలాస), నిఖిల్(బెంకిలి), బృందావతి(మందస)గా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.