Nara Lokesh: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌

అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసిన నారా భువనేశ్వరి;

Update: 2024-06-24 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు వేదమంత్రోచ్ఛారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్ లో లోకేశ్ ప్రత్యేక పూజలు చేసి, ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. కాగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్ కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

వేదపండితుల వెంట లోకేశ్ సచివాలయంలోని తన ఛాంబర్ కు వెళ్లడం, బాధ్యతలు స్వీకరిస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఏపీని ఐటీ రంగంలో అభివృద్ధిపథంలో నడిపిస్తావనే నమ్మకం తనకుందని భువనేశ్వరి చెప్పారు. ఐదేళ్ల పదవీకాలం విజయవంతం కావాలని, రాష్ట్రం పురోభివృద్ధికి, ప్రజలకు సేవ చేయడానికి లోకేశ్ సామర్థ్యం ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News