హథీరాంజీ మఠం మహంతిపై వేటు
వేల కోట్ల రూపాయల హాథీరాంజీ మఠం భూముల్ని అమ్మేసిన తిరుపతి హథీరాంజీ మఠం మహంతిపై వేటుపడింది;
వేల కోట్ల రూపాయల హాథీరాంజీ మఠం భూముల్ని అమ్మేసిన తిరుపతి హథీరాంజీ మఠం మహంతిపై వేటుపడింది. సీఐడీ విచారణలో నిజాలు తేలడంతో.. ఆయనపై చర్యలు తీసుకుంది ధార్మిక పరిషత్. గాంధీరోడ్డులోని అర్జున్ దాస్ మహంతి గదికి నోటీసులు అంటించారు. మరోవైపు ఆయన వాడే కారుతో పాటు మఠానికి సంబంధించిన తాళాలను అధికారులకు అప్పగించి వెళ్లిపోయారు. సెల్‌ఫోన్ సైతం స్విఛ్చాఫ్‌లో ఉంది. తిరుమల శ్రీనివాసునికి ఏ స్థాయిలో ఆస్తులు ఉన్నాయో అదే స్థాయిలో హాథీరాంజీ మఠానికి ఉన్నాయి. వీటిని సంరక్షించాల్సిన మహంతి... ఈ భూముల్ని అమ్మేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.