TTD: తిరుమల ఆస్తుల పరిరక్షణకు కమిటీ

Update: 2025-03-25 01:45 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు పరిరక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు తెలిపారు. శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. టీటీడీ ధర్మకర్త మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో లైసెన్స్‌ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని తెలిపారు. ఇతర దేశాల్లో ఆలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్ఛైన ర్మన్.. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భూమి వివాదాలపై పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది కాలంలో వివిధ రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు. గ్రామాల్లో అర్ధాంతరంగా ఆగిన ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సాయం అందజేస్తామన్న ఆయన.. శ్రీనివాస సేవా సమితి పేరుతో స్వామి వారికి కైంకర్యాల సామగ్రి సరఫరాలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. రూ.5,258.68 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం 2025-26 బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. రూ.772 కోట్లతో గదుల ఆధునికీకరణకు నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News