TTD: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో పెను సంచలనం

కీలక మలుపు తిరిగివ లడ్డూ నెయ్యి కల్తీ కేసు.. వెలుగులోకి విజయభాస్కర్ రెడ్డి లంచాల బాగోతం.. లంచం తీసుకున్నట్లు సిచ్ విచారణలో అంగీకారం

Update: 2026-01-10 02:30 GMT

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే తిరుమల లడ్డూను అపవిత్రం చేసినట్లు వెలుగులోకి వచ్చిన ఆరోపణలు ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ3 నిందితుడిగా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి తన పాత్రను స్వయంగా అంగీకరించడం కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చింది. తిరుమల లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యిని కొందరు కంపెనీలు కల్తీ చేశాయని, ఆ విషయాన్ని తెలిసీ కూడా తాను వారి పక్షాన వ్యవహరించానని విజయభాస్కర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో తాను లంచం తీసుకున్నట్లు కూడా ఆయన అంగీకరించడం సంచలనంగా మారింది. నెయ్యి నాణ్యతపై తప్పుడు నివేదికలు ఇచ్చి, కల్తీకి సహకరించినందుకు ప్రతిఫలంగా లంచం అందుకున్నట్లు ఆయన స్పష్టం చేసినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది.

సంచలన విషయాలు

కల్తీ నె­య్యి సర­ఫ­రా చేసే కం­పె­నీ­ల­కు అను­కూల రి­పో­ర్టు­లు ఇచ్చేం­దు­కు ఆయన డబ్బు, బం­గా­రం స్వీ­క­రిం­చి­న­ట్లు సిట్ వి­చా­ర­ణ­లో అం­గీ­క­రిం­చా­రు. మరో­వై­పు.. ఆయన దా­ఖ­లు చే­సిన బె­యి­ల్ పి­టి­ష­న్‌­ను నె­ల్లూ­రు ఏసీ­బీ కో­ర్టు శు­క్ర­వా­రం కొ­ట్టే­సిం­ది. హవా­లా మా­ర్గం­లో జరి­గిన ఈ లా­వా­దే­వీ­ల­పై సిట్ లో­తైన వి­చా­రణ జరు­పు­తోం­ది. తి­రు­మల లడ్డూ-నె­య్యి కల్తీ కే­సు­లో మరో సం­చ­లన పరి­ణా­మం వె­లు­గు­లో­కి వచ్చిం­ది. మొ­ద­టి­సా­రి నె­య్యి కల్తీ చే­సిన సర­ఫ­రా­దా­రు­ల­కు అను­కూ­లం­గా వ్య­వ­హ­రిం­చి­నం­దు­కు టీ­టీ­డీ డైరీ ని­పు­ణు­డు వి­జ­య­భా­స్క­ర్ రె­డ్డి లంచం స్వీ­క­రిం­చి­న­ట్లు సిట్ వి­చా­ర­ణ­లో స్వ­యం­గా అం­గీ­క­రిం­చా­రట.. ఇక, ఈ కే­సు­లో A34 కేసు నిం­ది­తు­డు­గా ఉన్న వి­జ­య­భా­స్క­ర్ రె­డ్డి, ముం­ద­స్తు బె­యి­ల్ పొం­దేం­దు­కు నె­ల్లూ­రు ఏసీ­బీ కో­ర్టు­లో పి­టి­ష­న్ దా­ఖ­లు చే­శా­రు. కేసు తర­ఫున వా­ద­న­లు వి­ని­పిం­చిన అసి­స్టెం­ట్ పబ్లి­క్ ప్రా­సి­క్యూ­ట­ర్ (ఏపీ­పీ) జయ­శే­ఖ­ర్ సమ­క్షం­లో కో­ర్టు ఆయ­న­కు బె­యి­ల్‌­ను డి­స్మి­స్‌ చే­సిం­ది.

ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న కోర్టు

మరోవైపు నిందితుడి తరఫు న్యాయవాది ముందస్తు బెయిల్ కోసం వాదనలు వినిపిస్తూ, విజయభాస్కర్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నారని, ఆయన నుంచి ఎలాంటి ఆధారాలు నశింపజేసే ప్రమాదం లేదని పేర్కొన్నారు. అయితే, స్వయంగా నిందితుడే లంచం తీసుకున్నట్లు అంగీకరించడం, కల్తీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడవడం వంటి అంశాలను కోర్టు తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఇరు పక్షాల వాదనలు పూర్తిగా విన్న అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు స్వభావం, ఆరోపణల తీవ్రత, ప్రజల విశ్వాసాలకు కలిగిన దెబ్బ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో విజయభాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ తీర్పుతో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు మరింత కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న అధికారులు, నిందితుల వాంగ్మూలాలతో దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా లంచం వ్యవహారానికి సంబంధించి డబ్బు లావాదేవీలు, కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీల పాత్రపై లోతైన దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News