మురుకు నీరు కాదు మంచి నీరు సరఫరా చేయండి
అనంతపురం జిల్లా గుంతకల్లులో టీడీపీ ఆందోళన చేపట్టింది;
అనంతపురం జిల్లా గుంతకల్లులో టీడీపీ ఆందోళన చేపట్టింది. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి టీడీపీ నేతలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు నిరసన తెలిపారు. జగన్ పాలనలో తాగునీటి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారం రోజులుగా మురుకునీటిని సరఫరా చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా రెండ్రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.