Andhra Pradesh: ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలు: తులసి రెడ్డి
Andhra Pradesh: బీజేపీ ప్రభుత్వం ఏపీకి శనిగ్రహంలా పట్టిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు.;
Andhra Pradesh: బీజేపీ ప్రభుత్వం ఏపీకి శనిగ్రహంలా పట్టిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనను నిరసిస్తూ కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలతో ఆందోళనకు దిగారు.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీపై వరాల జల్లు కురిపించిందని తులసిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ విజయవాడ మెట్రో రైలుతో పాటు పలు హామీలు ఇచ్చిందన్నారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటన్నింటీని పట్టించుకోలేదన్నారు.
వైసీపీ చేతకాని తనం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాలు, కేసుల నుంచి బయటకు వచ్చేందుకు రాష్ట్ర ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని.. బీజేపీ, వైసీపీకి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు.