బొమ్మూరు ఘటనపై టీవీ 5 ప్రసారం చేసిన కథనాలకు స్పందన

టీవీ 5 ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Update: 2020-10-06 14:04 GMT

తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో జరిగిన అమానుష ఘటనపై టీవీ 5 ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. టీవీ5 వరుస కథనాలతో పోలీసులు స్పందించారు. ఇప్పటికే ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు, రెండో నిందితుడు అప్పా రాజీవ్‌ కుమార్‌ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులో మైనర్‌పై అత్యాచారయత్నం కేసులో బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు వారిపైనే కేసులు పెట్టారు.. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.. వేధింపులు తట్టులేక బాలిక తండ్రి రాజమండ్రి అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనపై టీవీ5 వరుస కథనాలు ప్రసారం చేసింది.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది..

టీవీ5 కథనాలతో స్పందించిన పోలీసులు చర్యలు మొదలు పెట్టారు.. బెదిరింపులకు పాల్పడ్డవారిలో నాని అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేయగా, తాజాగా రాజీవ్‌కుమార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News