Jagdeep Dhankar : చంద్రబాబు చాలా గొప్ప నాయకుడు : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్
Jagdeep Dhankar : టీడీపీ అధినేత చంద్రబాబును ఉపరాష్ట్రపతి జగదీఫ్ ధన్ ఖడ్ కొనియాడినట్లు ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతలు తెలిపారు.
Jagdeep Dhankar : టీడీపీ అధినేత చంద్రబాబును ఉపరాష్ట్రపతి జగదీఫ్ ధన్ ఖడ్ కొనియాడినట్లు ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతలు తెలిపారు. ఎంపీ మాధవ్ వీడియో విషయంలో ఢిల్లీలో ఉపరాష్ట్రపతిని ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావించినట్లు ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ నేతలు తెలిపారు. చంద్రబాబు ఈజ్ గ్రేట్ లీడర్ అంటూ ఉపరాష్ట్రపతి చెప్పినట్లు మహిళా నేతలు వెల్లడించారు.
రాజకీయాల్లో చంద్రబాబు ఒకేలా ఉన్నారని వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. చంద్రబాబు వేషధారణ ఆయన హుందా తనాన్ని తెలియజేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి కలిగిన నేత అంటూ పొగడ్తల వర్షం కురింపించారు. ఆయన చాలా ముందు చూపుతో ఆలోచన చేస్తారని వైస్ ప్రెసిడెంట్ గుర్తుచేశారు. చంద్రబాబును ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కలవాలనుకుంటున్నట్లు మహిళా నేతలు వెల్లడించారు.