Visaka GVMC Corporators : కొండచరియల్లో చిక్కుకున్న విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్లు..
Visaka GVMC Corporators : విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్లు ప్రమాదంలో చిక్కుకున్నారు.
Visaka GVMC Corporators : విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్లు ప్రమాదంలో చిక్కుకున్నారు. కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండచరియలు విరిగిపడి ఘాట్ రోడ్డులో కార్పొరేటర్లు ఇరుక్కుపోయారు. ఈనెల 16వ తేదీన విశాఖ నగరపాలక సంస్థకు చెందిన 95మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు స్టడీ టూర్ కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కులుమనాలి నుంచి చండీగఢ్ వెలుతుండగా కొంచరియలు విరిగిపడి రాత్రి నుంచి రోడ్డుపై బస్సుల్లోనే ఉన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది రోడ్డ్ క్లీయర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వర్షం పడటంతో పరిస్థితి అనుకూలించడంలేదు. చండీగఢ్ కు 240 కిలోమీటర్ల దూరంలో ఈఘటన జరిగింది. వారు మింద్ ప్రాంతంలో చిక్కుకున్నట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు. నిన్న కులు మున్సిపాలిటీలోనే పలు ప్రాంతాలను సందర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు. అంతకు ముందు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలిని సందర్శించారు జీవీఎంసీ కార్పొరేటర్లు.