విశాఖ పోర్టు సత్తా చాటింది. స్వచ్ఛత కార్యక్రమాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2024 ఏడాదికి గానూ.. ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. విశాఖ పోర్టు అథారిటీ.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, మొక్కలు నాటడం, సఫాయి మిత్రసురక్ష వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని పోర్టు చైర్మన్ ఎం అంగముత్తు తెలిపారు. గతేడాది మూడో స్థానంలో నిలిచిన విశాఖ పోర్టు.. ఈసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. పోర్టులో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు విశాఖ పోర్టు చైర్మన్ ఎం అంగముత్తు తెలిపారు తెలిపారు. కేంద్రం సూచించిన విధంగా మొక్కలు నాటించి, సఫాయి మిత్రసురక్ష వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. కాగా స్వచ్ఛత పఖ్వాడ అవార్డ్స్ 2023 ఎడిషన్లో.. విశాఖ పోర్టు జాతీయ స్థాయిలో మూడవ స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు. ఈసారి ప్రధాన ఓడరేవులతో పోటీ పడి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు.