vizag: విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులోని హోటల్‌లో అగ్ని ప్రమాదం

కాలి బూడిదైన రెస్టారెంట్భ, యాందోళనకు గురైన జనాలు

Update: 2024-08-13 07:15 GMT

ఆర్కే బీచ్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాండురంగాపురం మత్స్య దర్శని పక్కనే ఉన్న రెస్టారంట్‌ కమ్‌ రీక్రియేషన్ సెంటర్‌ డైనో పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు.

విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డైనో పార్క్‌ రెస్టో కేఫ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. పాండురంగాపురం మత్స్య దర్శని పక్కనే ఉన్న డైనో పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో డైనో పార్క్‌ రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. రెస్టారెంట్ పక్కన ఇళ్లలోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. వెదురు బొంగులు, కలపతో రెస్టారెంట్‌ను నిర్మించడంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అన్న విషయం ఇంకా తెలియరాలేదు.

Tags:    

Similar News