VJA UTSAV: అట్టహాసంగా సాగుతున్న విజయవాడ ఉత్సవ్
‘ఒకే నగరం- ఒకటే సంబరం’ అనే నినాదంతో వేడుకలు
దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. నాలుగు వేదికలపై నిర్వహించిన విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు సరికొత్త అనుభూతిని పంచాయి. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. క్రాకర్స్ షో కళ్లు మిరిమిట్లు గొలుపుతున్నాయి. ప్రకాశం బ్యారేజీపై బాణసంచా వెలుగులు కనువిందు చేశాయి. విజయవాడ ఉత్సవ్‌ను.. ప్రజలందరికీ మంచి పండుగ సంబరాలను ఇస్తోంది. అన్ని రకాల కళా ప్రదర్శనలతో పాటు దసరా వేషాలు.. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ తరహాలో ప్రజలకు వినోదం పంచనున్నారు. సాధారణంగా మనం ఊళ్లలో తిరునాళ్లు నిర్వహించుకుంటూ ఉంటాం. దాన్ని మరింత పెద్ద స్థాయిలో విజయవాడలో ఏర్పాటు చేశారని అనుకోవచ్చు. ఇలాంటి తిరునాళ్లలో భాగం కావడం అంటే.. పిల్లలకే కాదు పెద్దలకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. చిన్న చిన్న ఆనందాలను ఇలాంటి ఉత్సవాలు తెచ్చి పెడతాయి.
ఇప్పుడు విజయవాడ కళ కళా లాడుతోంది. విద్యుత్ వెలుగు జిలుగులతో హుషారు కనిపిస్తోంది. గతంలో ఇబ్రహీంపట్నం వద్ద రోజూ.. కృష్ణాహారతి ఇచ్చేవాళ్లు. జగన్ సీఎం అయ్యాక ఆపేశారు. ఇప్పుడు మళ్లీ పాత వైబ్ కనిపిస్తోంది. ప్రజల సంతోషాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. విజయవాడ ఉత్సవం..నిర్విఘ్నంగా సాగనుంది.