AP: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్

పాలనలో నూతన శకానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం... తొలి విడతగా 161 సేవలు అందుబాటులోకి;

Update: 2025-01-31 01:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీ పాలనలో సంచలన మార్పులకు శ్రీకారం చుడుతూ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో కూటమి ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సప్‌ నంబర్‌ 95523 00009ను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ ఉంది. పౌరసేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది. దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సాప్‌లోనే ప్రభుత్వ సేవలు పొందనున్నారు.

మెటాతో ఒప్పందం

వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం గతేడాదిలో మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తేవాలని ప్రయత్నించినా కుదరలేదు. తాజాగా వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. తొలి విడతగా161 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

. ఇలా ఫిర్యాదు చేయండి

వాట్సాప్ నంబర్ 9552300009కి మెసేజ్‌ పంపితే, వెంటనే లింక్ వస్తుంది.

పేరు, ఫోన్ నంబర్, తదితర వివరాలు నమోదు చేసి, మీ వినతిని టైప్‌ చేయాలి.

దీనికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది.

ఈ నంబర్ ఆధారంగా మీ ఫిర్యాదు పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు.

ఏ సమస్యకైనా ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చు.

ఈ సర్టిఫికెట్స్ పొందవచ్చు

OBC, EWS, ఆదాయ సర్టిఫికేట్, నో ఎర్నింగ్ సర్టిఫికేట్

సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) దరఖాస్తుల స్టేటస్

విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపు

ట్రేడ్ లైసెన్స్, ల్యాండ్ రికార్డులు, రెవెన్యూ శాఖ ధ్రువపత్రాలు

APSRTC టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్, రిఫండ్, ఫీడ్‌బ్యాక్ సేవలు

Tags:    

Similar News