Gorantla Nude Video : హీటెక్కుతున్న గోరంట్ల న్యూడ్ వీడియో వివాదం..

Gorantla Nude Video : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై నిరనసలు కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2022-08-13 03:00 GMT

Gorantla Nude Vide : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై నిరనసలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం మహిళా జేఏసీ నేతలు ఎంపీ వ్యవహారాన్ని గవర్నర్ హరిచందన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల పూడి అనిత, ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జనసేన మహిళా నేత సౌజన్య, సీపీఎం మహిళా నేత రమాదేవి..నిన్న గవర్నర్‌ను కలిశారు. మాధవ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చేలా మాట్లాడిన అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపైనా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.మాధవ్‌ను వైసీపీ సర్కార్ రక్షించే ప్రయత్నం చేస్తుందన్నారు. విశేషాధికారాలను ఉపయోగించి నిజం నిగ్గు తేల్చాలని గవర్నర్‌ను కోరారు.

అటు గోరంట్లకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యూడ్ వీడియోల వ్యవహారం నుంచి బయటపడేందుకు సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు మహిళ నేతలు. నీతి, నిజాయితీ ఉంటే మాధవ్‌ లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కురుబ సమాజానికి చెడ్డ పేరు తెస్తున్న మాధవ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు కురుబ నేతలు సైతం గోరంట్ల మాధవ్‌పై మండిపడ్డారు. కురుబలకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. నమ్మి ఓట్లేస్తే కురుబల ఆత్మగౌరవాన్ని బజారుకీడ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాడ్స్‌ కింద ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై గోరంట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు టీడీపీ నేతలు. మార్ఫింగ్‌ అంటూ టీడీపీపై నిందలేయడం సరికాదన్నారు. నీచ రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. వైసీపీ నేతల నుంచి మహిళలను కాపాడాలంటూ తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎప్‌ వినూత్న నిరసన చేపట్టింది.

Tags:    

Similar News