ఏపీ దేవాదాయ శాఖ ఆదేశాలను తప్పుబట్టిన యనమల

Update: 2020-11-14 06:03 GMT

శారదాపీఠం స్వామీజీ స్వరూపానంద పుట్టినరోజు సందర్బంగా 23 దేవాలయాల నుంచి కానుకలు పంపాలన్న ప్రభుత్వ ఆదేశాలను తప్పుపట్టారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. దేవాదాయ శాఖ ఆదేశాలను ఆయన తప్పుపట్టారు. సనాతన సంప్రదాయాలకు వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం స్వామిభక్తి కాదన్నారు. స్వామిజీపట్ల భక్తి ఉంటే... సొంత డబ్బులతో కానుకలు ఇవ్వాలన్నారు.

సీఎంకు ప్రజల పట్ల భక్తికన్నా.. తనతో హోమాలు చేయించిన స్వామిభక్తి శ్రుతిమిచిందని యనమల ఆరోపించారు. చిన జీయర్ స్వామికి, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, ఇతర స్వామీజీల పుట్టిన రోజులకు లేని ఆలయ మర్యాదలు.... స్వరూపానందకు ఇవ్వడం ఇతర స్వామీజీలను, పీఠాలను కించపరచడమే అన్నారు. ఎన్నడూ లేని సాంప్రదాయాలను సీఎం సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అన్నారు.

Tags:    

Similar News