పీక్స్‌కు చేరుకున్న హిదూపురం వైసీపీ గ్రూప్ పాలిటిక్స్
హిందూపురం వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయి. ఎన్నికలకు ఏడాది ముందే ఫ్యాన్ పార్టీలో టికెట్ల కోసం రచ్చ మొదలైంది;
హిందూపురం వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయి. ఎన్నికలకు ఏడాది ముందే ఫ్యాన్ పార్టీలో టికెట్ల కోసం రచ్చ మొదలైంది. ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు.. హిందూపురం టికెట్ ఇవ్వాలంటూ ముస్లిం మైనార్టీలు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ బలోపేతం కోసం ఎమ్మెల్సీ ఇక్బాల్ నాలుగేళ్లుగా కష్టపడుతున్నారని.. ఆయనకే టికెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు హిందూపురం నియోజకవర్గానికి వైసీపీ అధిష్ఠానం కొత్త ఇన్‌చార్జ్‌ను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు హిందూపురంలో బలప్రదర్శన చేశారు. వైసీపీ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమని ఎమ్మెల్సీ ఇక్బాల్ అనుచరులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్సీ ఇక్బాల్.. విజయవాడలో సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.