వైసీపీ నేతల అరాచకాలు.. చనిపోయిన వారిపేర్లతో ఓటర్ స్లిప్పులిచ్చి రిగ్గింగ్?
చనిపోయిన వారి పేర్లతో ఓటర్ స్లిప్పులు ఇచ్చి రిగ్గింగ్‌కు పాల్పడిన ట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.;
గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో... వైసీపీ నేతల అరాచకాలపై మండిపడుతున్నాయి టీడీపీ శ్రేణులు. చనిపోయిన వారి పేర్లతో ఓటర్ స్లిప్పులు ఇచ్చి రిగ్గింగ్‌కు పాల్పడిన ట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటన 68 వ వార్డులో జరిగినట్లు టీడీపీ మహిళా అభ్యర్ధి అనంతలక్ష్మి ఆధారాలతో సహా బైటపడ్డారు. అకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారంటూ మండిపడ్డారు. 9 నుంచి 14వ నెంబర్ బూతులతో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారన్నారు. 68వార్డులోని ఆరు బూతుల్లో రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు.