YCP Survey : వైసీపీలో సర్వే టెన్షన్.. పడిపోయిన ఎమ్మెల్యేల గ్రాఫ్..
YCP Survey : అధికార వైసీపీలో సర్వేలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి
YCP Survey : అధికార వైసీపీలో సర్వేలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ నేతల్లోనే కాదు.. అధినేత జగన్‌లోనూ గుబులు రేపుతున్నాయి. 175 కాదు.. సగం మంది కూడా వచ్చే ఎన్నికల్లో గెలవలేరని తేలిపోయింది. ఇది వేరెవరో చెప్పింది కాదు. జగనే స్వయంగా చేయించుకున్న సర్వే రిపోర్ట్ చెబుతున్న వాస్తవాలు. అటు ఇన్‌ఛార్జుల నియామకం.. వైసీపీలో చిచ్చు రేపుతున్నాయి. ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోవడం జగన్‌లో కలవరం మొదలైందా? ప్రభుత్వంపై వ్యతిరేకతను, బయటపడుతున్న వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఆయా చోట్ల వైసీపీలో వర్గపోరు పంచాయితీ దేనికి సంకేతం? అసలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే సీన్ ఉందా..? అనేది ఏపీలో చర్చనీయాంశంగా మారింది.