Tirumala: తిరుమల ఘాట్ రోడ్.. లోయలోకి దూకిన ఇద్దరు యువకులు
Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకులు హల్‌చల్ చేశారు.. అలిపిరి టోల్ గేట్ దగ్గర కారు అపకుండా దూసుకెళ్లారు;
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకులు హల్‌చల్ చేశారు.. అలిపిరి టోల్ గేట్ దగ్గర కారు అపకుండా దూసుకెళ్లారు అయితే సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు రెండవ ఘాట్‌రోడ్డులోని లింక్‌రోడ్డు దగ్గర కారును అడ్డుకున్నారు. అయితే కారులో ఉన్న ఇద్దరు యువకులు కారును వదిలి పక్కనే వున్న లోయలోకి దూకేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలతో పాటు పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు..
రాజమండ్రికి చెందిన ఇద్దరు యువకులు రేణుగుంట చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి కారులో తిరుమల తీసుకెళ్తుండగా అలిపిరి గేట్ దగ్గర చెకింగ్ దగ్గర తనను కాపాడాలంటూ పెద్దగా కేకలు వేయడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు..ఇంతలో భయంతో కారులోని యువకులు పరుగులు తీశారు.. చేజ్ చేసిన పోలీసులు లోకేష్, రాజేష్, గణేష్‌లను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు యువకులు ఘాట్ రోడ్డులోని లోయలో దూకి పారిపోయారు.. ప్రేమ వ్యవహరమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు అంటున్నారు.