తెలుగు రాష్ట్రాల్లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. లైంగికదాడి చేస్తున్న సమయంలోనే వీడియో తీసిన యువకుడు... ఆ వీడియోతో యువతిని బెదిరించాడు. వేధింపులు పెరగడంతో యువతి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!
హైదరాబాద్ నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్ చేశారు.