PAWAN: "దేవుడిపై పగబట్టిన వైసీపీ"
వైసీపీపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్
భగవంతుడిపై వైసీపీ పగబట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్భేటీ అయిన ఆయన కీలక విషయాలపై చర్చించారు. హిందువులందరూ తిరుమలను ఏడు కొండలు అని అంటామని, కానీ వాళ్లు రెండు కొండలు అని అంటారని ఆయన తెలిపారు. లడ్డూ నెయ్యిలో బీఫ్, పంది కొవ్వు, ఫిష్ అయిల్ ఉందని ఎన్‌డీడీబీ రిపోర్టు ఇచ్చిందని, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు చదవి వినిపించారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఈ అంశంపై చర్చించిన తర్వాతనే తాము మాట్లాడని తెలిపారు. పర్యవసానాలు ఆలోచించిన తర్వాతనే తాము మాట్లాడామని పవన్ పేర్కొన్నారు.ప్రజలు తమకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, అలాంటిది రాజకీయ లబ్ధికోసం మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. కల్తీ నెయ్యితో అయోధ్యకు లక్ష లడ్డూలు పంపారని, 59 లక్షల కేజీల నెయ్యి కాదని, దాన్ని కల్తీ పామాయిల్ అనాలని పవన్ వ్యాఖ్యానించారు. భోలేబాబా డెయిరీ 58 లక్షల కేజీల పామాయిల్, లక్ష కిలోల రసాయనాలు కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో హిందూమతంపై చాలా దాడులు జరిగాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. వైసీపీ పాలన కాలంలో అనేక ఆలయాలకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకున్నాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. రామతీర్థంలో శ్రీరామచంద్ర స్వామి విగ్రహం ధ్వంసం కావడం, దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగినప్పుడు “ఇవి పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు” అన్న తరహా వ్యాఖ్యలు రావడం భక్తులను తీవ్రంగా గాయపరిచిందని అన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే, దాన్ని ఎవరో పిచ్చివాడు చేసిన పని అని తేల్చడం దేవుడిపట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని చూపిస్తుందని విమర్శించారు. ఈ అంశాలపై తాము చాలా అప్రమత్తంగా మాట్లాడుతున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా విశ్లేషించి స్పందిస్తున్నారని చెప్పారు. తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఎన్‌డీడీబీ నివేదికను ముఖ్యమంత్రి తమకు చదివి వినిపించారన్నారు. జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు వంటి పదార్థాలు కలిసే అవకాశాలున్నాయని నివేదికలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు.
వైసీపీ భక్తుల మనోభావాలను దెబ్బతీసింది: ఏపీ బీజేపీ చీఫ్
వైసీపీ పాలనలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిబంధనలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో జరిగిన అక్రమాలు భక్తుల మనోభావాలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై వైసీపీ నేతలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. డియాతో మాట్లాడిన మాధవ్, పాల సేకరణ సామర్థ్యం లేని ఒక డెయిరీ సంస్థ నుంచి భారీగా నెయ్యి ఎలా సరఫరా జరిగిందో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నెయ్యి కాని పదార్థాలతో, రసాయనాలు కలిపి తయారు చేసిన నెయ్యిని తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించడం అత్యంత దారుణమని ఆయన అన్నారు.భక్తుల విశ్వాసాన్ని తక్కువచేసి, పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేశారని విమర్శించారు.