సక్సెస్‌ కోసం బాలీవుడ్‌ ఫార్ములాలు

Update: 2023-06-04 06:23 GMT

సినిమా సక్సెస్‌ కోసం బాలీవుడ్‌ రకరకాల ఫార్ములాలను కనిపెడుతోంది. పాత పద్ధతలను రిపీట్‌ చేస్తోంది. తాజగా విడుదలైన -జర జట్కే.. జర బచ్‌కే- సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇదే ఫార్ములాతో సక్సెస్‌ సాధిస్తోంది. విక్కీ కౌశల్‌, సారా అలీ ఖాన్‌ నటించిన ఈ సినిమా నిర్మాతలను అంచనాను మించి కలెక్షన్స్‌ను సాధింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు నిర్మాతలు చేసిన మార్కెటింగ్‌ జిమ్మిక్కులు కూడా బాగా పనిచేశాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ సినిమా టికెట్‌ ధరలను తక్కువగా ఉంచడమే గాక... బై వన్‌ గెట్‌ వన్‌ ఆఫర్‌ ఇవ్వడంతో సులభంగా జనంలోకి వెళ్ళింది. సినిమా చూసినవారు కూడా హ్యాపీగా ఫీల్‌ కావడంతో పాజిటివ్‌ టాక్‌ ఫాస్ట్‌గా జనాల్లో వెళ్ళింది.

ఈ సినిమా నిర్మాతలు మళ్ళీ పాత పద్ధతుల్లో తమ సినిమాను ప్రమోట్‌ చేశారు. మల్టిప్లెక్స్‌లలో ప్రమోషన్‌ చేస్తూ... యూత్‌ దగ్గరకు సినిమాను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్‌ పెరిగాయి.

మొదటి రోజు దాదాపు ఆరు కోట్ల రూపాయల కలెక్షన్స్‌ సాధించిన ఈ సినిమా రెండో రోజు కనీసం 8 కోట్లు కలెక్ట్‌ చేసిందని భావిస్తున్నారు. ఆదివారం కూడా బై వన్‌ గెట్‌ వన్‌ ఆఫర్‌ ఉండటంతో... కలెక్షన్స్‌ ఇంకా పెరిగే అవకాశముందని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రమోషన్‌, ఆఫర్‌తో పాటు సినిమా కంటెంట్‌ కూడా బాగుండటంతో తొందరగా టాక్‌ వచ్చిందని.. దీంతో వచ్చేవారం కూడా కలెక్షన్స్‌ బాగుంటాయని భావిస్తున్నారు. పైగా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ ... కలెక్షన్స్‌ బాగుండటంతో... ఓటీటీ కంపెనీలు కూడా ఎక్కువ మొత్తానికి కొనే ఛాన్స్‌ ఉందని బాలీవుడ్‌ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. చిన్న సినిమాలు కూడా కంటెంట్‌తో పాటు మార్కెటింగ్‌ కూడా భిన్నంగా చేయాల్సి ఉంటుందని వీరు చెబుతున్నారు.

Tags:    

Similar News