నవీన్ పోలిశెట్టి మూవీస్ విషయంలో క్లియర్ గా ఉంటాడు. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్నాడు. ఆల్రెడీ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హ్యాట్రిక్ కొట్టాడు. ఈ మూడు కథలు, జానర్స్ విషయంలోనూ స్పెషల్ గా ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ అయిన యాక్సిడెంట్ కారణంగా అనగనగా ఒక రాజు మూవీ విడుదల ఆలస్యం అయింది. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా ఈ మధ్య ట్రెండ్ లో భాగంగా సంక్రాంతి స్పెషల్ మూవీతో వస్తున్నాడు. ఈ టైమ్ లో సినిమా అంటే పండగ స్పెషల్ గ్యారెంటీ అనిపించేలా ఉన్నాడీ మూవీతో. అనగనగా ఒక రాజుతో డబుల్ హ్యాట్రిక్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడా అంటే అవుననే అనేలా ఉంది.
అనగనగా ఒక రాజు పక్కా సంక్రాంతి మూవీలా ఉంది. ఈ పండగకు ఆడియన్స్ ఎలాంటి మూవీని ఎక్స్ పెక్ట్ కోరుకుంటున్నారు అంటే ఇలాంటి మూవీ అనేలా ఉంది. పూర్తిగా గోదావరి స్లాంగ్ లో సాగే కథనం. కథ కూడా అలాంటిదే. నవీన్ కు కొత్తగా ఉండే స్లాంగ్ ఇది. అఫ్ కోర్స్ అతను ఎలాంటి స్లాంగ్ లో అయినా మూవీ చేయగలడు అనిపించేలా ఉన్నాడు. ట్రైలర్ తోనే విపరీతంగా నవ్వించాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి సైతం తనదైన టైమింగ్ తో ఆకట్టుకునేలా ఉంది. ఆ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కనిపిస్తోంది. అలాగే తను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మెప్పించింది. ఈ సారి సోలో హీరోయిన్ గా సత్తా చాటేలా ఉంది.
మారి అనే కొత్త దర్శకుడు రూపొందించిన సినిమా అనగనగా ఒక రాజు. సితార బ్యానర్ లో నాగవంశీ నిర్మించాడు. సితారలో ఓ కొత్త దర్శకుడు మూవీ చేయడం అంటే మాగ్జిమం విజయం సాధించినట్టే అనిపించారు. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ మూవీ ఇస్తాడు అనిపించారు. సో.. అనగనగా ఒక రాజుతో ఓ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించారు. మరి ఈ 14న రాబోతోన్న ఈ మూవీతో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనేలా ఇప్పటికే మూవీ కలరింగ్ అంతా కనిపిస్తోంది.