అపార్ట్‌మెంట్‌లో రెండు ప్లాట్లు.. వంద కోట్లు
ముంబైలోని జుహే వెర్సొవా లింక్ రోడ్డులో ఉన్న విశాలమైన అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లోర్లను;
ఒకప్పటి తరం నటీనటుల కంటే, నేటి తరం నటీ నటులు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. ఫామ్‌లో ఉండగానే ఆస్తులు కూడబెడుతున్నారు. ముంబై మహానగరం బాలీవుడ్ నటీనటుల స్వర్గ ధామం. అక్కడ ప్లాట్ కొంటే హ్యాపీగా స్థిరపడిపోయినట్లు భావిస్తారు. తాజాగా నటుడు హృతిక్ రోషన్ అరేబియా మహాసముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్లో వంద కోట్లు వెచ్చింది రెండు ప్లాట్‌లు బుక్ చేసుకున్నాడు. ముంబైలోని జుహే వెర్సొవా లింక్ రోడ్డులో ఉన్న విశాలమైన అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లోర్లను రూ.97.5 కోట్లకు కొనుగోలు చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. డూప్లెక్స్ పెంట్‌హౌస్ కోసం రూ.67.5 కోట్లు, 14వ అంతస్తు ప్లాట్ కోసం రూ.30 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో విలాసవంతమైన 4 పడకగదులు, ఒక హాలు, కిచెన్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ టేబుల్, విశాలమైన జిమ్ ఉన్నాయట.