బైడెన్ పాలన ఏడాదే.. ఆ తరువాత కమలదే హవా: కంగన షాకింగ్ కామెంట్స్

అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ఏడాదికి మించి బతకరని..

Update: 2020-11-09 07:58 GMT

అందరూ వెళ్లే దారిలో ఆమె వెళ్లరు.. అందుకే కొందరికి ఆమె నచ్చరు. బాలీవుడ్‌లో బోల్డ్ నటి ఎవరైనా ఉన్నారా అంటే కంగన పేరు కచ్చితంగా వినిపిస్తుంది.. ఎవరేమనుకుంటే నాకేంటి నా అభిప్రాయం నే చెప్తా అంటూ ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తన దృష్టి సారించారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.

అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న జో బైడెన్‌ను ఆ దేశంతో పాటు ప్రపంచమంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్న తరుణంలో కంగన షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ఏడాదికి మించి బతకరని, ఆ తరువాత మొత్తం బాధ్యతలు చూసుకునేది కమలా హ్యారిస్ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రతి ఐదు నిమిషాలకు డేటా క్రాష్ అయిపోయే గజినీ బైడెన్. ఆయనకు ఎక్కించిన మందులతో ఏడాదికి మించి బతుకుతారని అనుకోవడం లేదని అన్నారు.

ఆ తరువాత కమలా హ్యారిస్ అధ్యక్షపదవిని చేపడతారు. ఒక మహిళ ఎదిగితే మరికొందరు మహిళలు ఎదిగేందుకు అవకాశం ఉంటుందని కంగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ అమెరికాకు 49వ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News