ప్రముఖ సింగర్ మృతి... ప్రధాని మోడీ సంతాపం!

సుప్రసిద్ధ భజన గాయకుడు నరేంద్ర చంచల్ ఢిల్లీలో అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

Update: 2021-01-22 12:33 GMT

సుప్రసిద్ధ భజన గాయకుడు నరేంద్ర చంచల్ ఢిల్లీలో అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నరేంద్ర చంచల్‌ను భజన్ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నరేంద్ర చంచల్‌ కేవలం భజన పాటలతో పాటుగా, హిందీ చిత్రాలలో పాటలు పాడారు. బాబీ చిత్రంలో బేషక్ మందిర్ మసీదు పాట కోసం 1973 లో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు.

నరేంద్ర చంచల్ మృతి పట్ల దేశ ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని ప్రధాని ట్వీట్ చేశారు. తన మధురమైన గానంతో ఆధ్యాత్మిక ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని మోడీ గుర్తు చేసుకున్నారు. నరేంద్ర చంచల్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

కాగా నరేంద్ర చంచల్ స్వస్థల పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా నమక్ మండి. అయన 1840, అక్టోబరు 16న పంజాబీ ఫ్యామిలీలో ఆయన జన్మించారు. అయితే వారిది ఆధ్యాత్మిక కుటుంబం అయినప్పటికీ అయన భజన పాటలు పాడేవారు. 

Tags:    

Similar News